ప్రొద్దుటూరు: సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కడప జిల్లా బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు ముప్పే వెంకట్ నాయుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు. 
ఈ సందర్భంగా ముప్పే వెంకట్ నాయుడు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. రోగులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ కుమారి, ప్రొద్దుటూరు అర్బన్-1 జనరల్ సెక్రటరీ చెన్న మోహన్ కుమార్, రాచమల్లు సంజీవ రెడ్డి, ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడు తుపాకుల చౌడయ్య, సంకల్ప్ అభియాన్ కన్వీనర్ రెడ్డి ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. 
Save or share this story as a newspaper-style Epaper Clip: