ప్రొద్దుటూరు: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు ప్రొద్దుటూరు శివాలయంలో అమ్మవారిని బాల త్రిపుర సుందరి దేవిగా విశేషంగా అలంకరించారు. పుష్పాలు, ఆభరణాలతో అమ్మవారిని సుందరంగా ముస్తాబు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు బాల త్రిపుర సుందరి దేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేశారు. అమ్మవారి కృపతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి చేకూరాలని భక్తులు ఆకాంక్షించారు.
దసరా నవరాత్రుల్లో అమ్మవారి వివిధ రూపాల అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Save or share this story as a newspaper-style Epaper Clip: