దాసరిపల్లెలో బీజేపీ అభ్యర్థి అమ్మిరెడ్డి మనోహర్ రెడ్డి ముమ్మర ప్రచారం

ఇంటింటికీ వెళ్లి కమలం గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

దువ్వూరు: నీలాపురం ఎంపీటీసీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అమ్మిరెడ్డి మనోహర్ రెడ్డి శనివారం దాసరిపల్లె గ్రామంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలుసుకుంటూ, బీజేపీ కమలం గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటు వేసి బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు ఆరవేటి హరికృష్ణ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి, బీజేపీ నాయకులు భాస్కర్ రెడ్డి, లక్ష్మయ్య యాదవ్, దువ్వూరు మండల బీజేపీ నాయకులు పల్లె సుబ్బారెడ్డి, అమ్మిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బాలనాగిరెడ్డి, కేశవరెడ్డి, రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసి ఇంటింటి ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

Save or share this story as a newspaper-style Epaper Clip:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *