కమలం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరిన బీజేపీ రాష్ట్ర నాయకులు ఆరవేటి హరికృష్ణ
**దువ్వూరు:** నీలాపురం ఎంపీటీసీ కూటమి అభ్యర్థి అమ్మిరెడ్డి మనోహర్‌రెడ్డికి మద్దతుగా ఆదివారం ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు ఆరవేటి హరికృష్ణ, మండల అధ్యక్షుడు పల్లె సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మూడిండ్లపల్లె గ్రామపంచాయతీ పరిధిలోని చిన్నపల్లె గ్రామాల్లో ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నీలాపురం ఎంపీటీసీ అభ్యర్థి అమ్మిరెడ్డి మనోహర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. కమలం గుర్తుపై ఓటు వేసి అభ్యర్థికి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల అభివృద్ధికి కూటమి అభ్యర్థికి ప్రజలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు బాల నాగిరెడ్డి, నాగేంద్ర, బ్రహ్మానందరెడ్డి, బాల నారాయణరెడ్డి, బుజ్జి, భైరవ తదితరులు పాల్గొన్నారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: