వైఎస్ వివేకా కూతరు సునీత మీడియా సమావేశం : నేను, షర్మిల ఎవరి ప్రభావంతోనే మాట్లాడుతున్నామంటున్నారు – హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టించి అవినాష్ పై మాట్లాడించింది మీరు కదా? – మరి ఆనాడు మీరు చెప్పినట్లు చేస్తే మీ ప్రభావంతోనే మాట్లాడానా? – ఎవరినైనా ఒకసారి మోసం చేయవచ్చు.. పదేపదే చేయలేరనేది గ్రహించాలి – ప్రజలు అంతా గ్రహిస్తున్నారు.. వాస్తవాలేంటో వారికి తెలుసు – ప్రతిసారి అందరినీ మోసం చేయలేరనేది గుర్తుపెట్టుకోవాలి – అన్నగా నాకు సమాధానం చెప్పకపోయినా ఫర్యాలేదు.. కానీ సీఎంగా చెప్పాలి – వివేకాను ను ఎవరు చంపారో కడపలో ప్రజలందరికీ తెలుసని జగన్ అన్నారు – అవినాష్ ను అరెస్టు చేస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని భయమా? – జగన్ ఎందుకు భయపడుతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి – నాతో నేరుగా మాట్లాడాలంటే సాక్షి ఛానల్ కే వస్తా.. ధైర్యంగా మాట్లాడదాం – నాకు అభ్యంతరం లేదు.. సాక్షి ఛానల్ కు నేను వస్తా – డిబేట్ చేస్తే వాస్తవాలన్నీ బయటకు వస్తాయి – కడప ఎంపీగా షర్మిల పోటీ చేయబోతున్నారని తెలిసింది.. ఆమెకు శుభాకాంక్షలు – సంఘీభావం చెబుదామంటే కూడా చెప్పలేని పరిస్థితి.. నేను కోర్టుకు రావాల్సి వచ్చింది – మీరు జైలుకు వెళ్లినప్పుడు షర్మిల కష్టపడి ఎన్నికల ప్రచారం చేసి గెలిపించింది – కష్టపడి పనిచేసి గెలిపించిన షర్మిలను చూసి జగన్ భయపడ్డారు – తనకంటే షర్మిలకు ఎక్కువ పేరు వస్తుందని జగన్ భయపడ్డారు – షర్మిలను ఎంపీ అభ్యర్థిగా పెట్టాలని ఆనాడు వివేకా అనుకున్నారు – ఆ ప్రయత్నంలోనే హత్యకు గురయ్యారు – షర్మిలకు మద్దతు కూడా లేకుండా చేసేందుకే వివేకాను చంపేశారా? – కడపలో అవినాష్ రెడ్డిని ఓడించాలి.. వీలైతే జగన్ ను కూడా ఓడించాలి – వైసీపీని అధికారంలోకి రాకుండా చేయాలి.. ప్రస్తుతానికి ఇదే నా లక్ష్యం – కోర్టుల్లో శిక్ష పడకుండా జగన్ తప్పించుకుంటున్నారు – ప్రజా జీవితంలో జగన్ లాంటి నేరస్థులు ఉండకూడదు – మరోసారి మోసం చేసి గెలవాలని జగన్ చూస్తున్నారు – ప్రజల్ని పదేపదే మోసం చేయడం కుదరదు – వివేకాను సినిమాలో చూపించిన దానికంటే ఇంకా ఘోరంగా హత్య చేశారు – హత్యా రాజకీయాలకు చోటు ఉండకూడదు – జగన్ మళ్లీ రావడం రాష్ట్రానికి మంచిది కాదు – రాష్ట్రాభివృద్ధి జరగాలంటే హత్యా రాజకీయాలకు దూరంగా ఉండాలి – జగన్ ప్రభుత్వం రక్తంతో మునిగి ఉంది – నేనెప్పుడూ రాజకీయాల్లో లేను – నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని జగన్ ను కోరుతున్నా – రెండేళ్ల క్రితం పులివెందులలో మాపై కేసు పెట్టారు – తప్పుడు సాక్ష్యాలు చెప్పిస్తున్నామని పెట్టిన కేసు ఇటీవల ఎఫ్ఐఆర్ చేశారు – ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని కోర్టుకు వచ్చాను : వైఎస్ వివేకా కూతరు సునీత

previous post
next post