Tv424x7
Telangana

తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ (Shanti Swaroop) కన్నుమూత

హైదరాబాద్‌: . రెండు రోజుల క్రితం గుండెపోటుతో నగరంలోని యశోదా ఆస్పత్రిలో చేరారు.అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. తెలుగులో తొలిసారి వార్తలు చదివిన ఆయన.. చెరగని ముద్రవేశారు. పదేళ్లపాటు టెలీప్రాంప్టర్‌ లేకుండా పేపర్‌ చూసి చెప్పేవారు.1983 నవంబర్‌ 14 నుంచి దూరదర్శన్‌లో వార్తలు చదవడం ప్రారంభించారు. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు ఆయనది. 2011లో పదవీ విరమణ చేసేవరకు దూరదర్శన్‌లో పనిచేశారు. లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నారు. శాంతిస్వరూప్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

Related posts

మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి

TV4-24X7 News

నేటి నుంచి భద్రాద్రిలో బ్రేక్ దర్శనం

TV4-24X7 News

నేడు నుంచి అతి భారీ వర్షాలు

TV4-24X7 News

Leave a Comment