Tv424x7
Andhrapradesh

జగన్‌ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకొని ఏపీని నట్టేట ముంచారు: నారా లోకేశ్‌

అమరావతి: తెదేపా-జనసేన కూటమి అధికారంలోకి రాగానే ఉద్యోగుల బకాయిలను విడతల వారీగా చెల్లిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) హామీ ఇచ్చారు..తాడేపల్లిలో పూజిత అపార్టుమెంట్‌ వాసులతో ఆయన సమావేశం నిర్వహించి మాట్లాడారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు నెలాఖరునే జీతాలు చెల్లించారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. మంగళగిరిని అభివృద్ధి చేయాలంటే వచ్చే ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 2019లో ఎక్కడైతే అభివృద్ధి ఆగిపోయిందో.. అక్కడి నుంచి తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. సీఎం జగన్‌ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకొని రాష్ట్రాన్ని నట్టేట ముంచారని నారా లోకేశ్‌ విమర్శించారు..

Related posts

రాజధాని ఫైల్స్’ సినిమా రిలీజ్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

TV4-24X7 News

మహిళా పోలీసులతో సీఐ దేముడు బాబు సమావేశం

TV4-24X7 News

నేటి నుంచి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు

TV4-24X7 News

Leave a Comment