సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండల కేంద్రంలో జిల్లా నాయకులు పల్లె రమేష్ యాదవ్ వారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ క్యాలెండర్ ను ఇంటి ఇంటికి పంపిణీ చేయడం జరిగింది. మెదక్ పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు ను గెలిపించాలని ప్రచారం చేయడం జరిగింది. జిల్లా నాయకులు పల్లె రమేష్ యాదవ్ మాట్లాడుతూ రాబోయేఎంపీ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు ఖాయo అని భారతదేశంలో ముచ్చటగా మూడోసారి నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి అధికారం చేపట్టడం ఖాయం అని అన్నారు.ఈ కార్యక్రమంలో పల్లె రమేష్ యాదవ్ జిల్లా నాయకులు మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి కట్ట భాగ్యలక్ష్మి ములుగు 236విలేజ్ భూత అధ్యక్షుడు రమేష్ ములుగు 238 భూత అధ్యక్షుడు కొలువురు స్వామి వినోద్ భాను మణికంఠ వివిధ మోర్చాల కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
