మహాత్మా జ్యోతి రావు పూలే చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని జెడ్పిటీసీ మంగమ్మ రామచంద్రం, వంటి మామిడి మార్కేట్ కమిటీ మాజీ డైరెక్టర్ రాందాస్ గౌడ్ అన్నారు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి లో గురువారం మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి సందర్భంగా మహనీయుల ఉత్సవ కమిటీ చైర్మన్ జాలని యాదగిరి, కో కన్వీనర్ కనకరాజు, స్వేరో సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్ని కృష్ణ ఆధ్వర్యంలో సావిత్రి భాయి జ్యోతి రావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న జడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, వంటి మామిడి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ రాందాస్ గౌడ్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతి రావు పూలే అదర్షనీయుడు అని, విద్యతోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు అని ఆనాటి కాలంలోనే ప్రతి ఒక్కరికి విద్యను నేర్పడానికి విశేషంగా కృషి చేశారని చూపిన బాటలో ప్రతి ఒక్కరు పయనించాలని యువత ఒక లక్ష్యం ఎంచుకొని దానికోసం కృషి చేయాలని జీవితంలో స్థిరపడి గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని యువతకు సందేశాన్ని ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ తాజా మాజీ ఉప సర్పంచ్ గుర్రాల స్వామి,నాయకులు గ్యార మల్లేష్, గుడాల శేఖర్ గుప్తా, ర్యాకం యాదగిరి,రాంబాబు, కొండ యాదగిరి,బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు

next post