Tv424x7
National

వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు..!

ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ (WhatsApp) తన ప్లాట్‌ఫామ్‌ను ఆల్‌-ఇన్‌-వన్‌గా రూపుదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. ఆ దిశగా కొత్త కొత్త ఫీచర్లు జోడిస్తోంది..ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) సదుపాయాన్ని తీసుకొచ్చిన ఈ యాప్‌.. మరో కొత్త ఫీచర్‌కు సిద్ధమవుతోంది. ఇంటర్నెట్‌ లేకున్నా ఫొటోలు, వీడియోలు, ఫైల్స్‌ను షేర్‌ చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. అంటే ఇకపై నెట్‌వర్క్‌తో సంబంధం లేకున్నా మీ డాక్యుమెంట్లను పంపించొచ్చన్నమాట.సాధారణంగా నెట్‌వర్క్‌ సదుపాయం లేకున్నా బ్లూటూత్‌ సాయంతో షేర్‌ఇట్‌, నియర్‌ బై షేర్‌ వంటి అప్లికేషన్ల ద్వారా ఫొటోలు, సినిమాలు పంపిస్తుంటారు. అచ్చం ఆ తరహా సేవల్నే వాట్సప్‌ అందుబాటులోకి తేనుంది. దీనివల్ల ఎటువంటి ప్రత్యేక యాప్‌ వినియోగించాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్లను మరింత వేగంగా సురక్షితంగా పంపేందుకు ఈ ఫీచర్‌ ఉపయోగపడనుంది. ఈ ఫీచర్‌ ఎనేబల్‌ చేసుకోవాలంటే వాట్సప్‌ సిస్టమ్‌ ఫైల్‌, ఫొటోల గ్యాలరీ యాక్సెస్‌ లాంటి అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది.మీరు పంపించాలనుకుంటున్న వ్యక్తి మొబైల్‌ బ్లూటూత్‌ కనెక్ట్‌ అయ్యేంత దగ్గర్లో ఉంటేనే ఆఫ్‌లైన్‌ షేరింగ్‌కు వీలవుతుంది. బ్లూటూత్‌ ఆన్‌ చేసి దగ్గర్లోని వాట్సప్‌ యూజర్‌ పరికరాన్ని గుర్తించి ఫైల్‌ సెండ్‌ చేయాలి. అవతలి వ్యక్తి అనుమతి ఇస్తేనే ఈతరహా షేరింగ్‌ సాధ్యమవుతుంది. వద్దనుకుంటే ఆఫ్‌ చేసే సదుపాయం కూడా ఉంది. వాట్సప్‌ ద్వారా వివిధ రకాల ఫైల్స్‌ను పంపడాన్ని సులభతరం చేయడం కోసం ఈ ఫీచర్‌ని తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతున్నట్లు వాట్సప్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ అందించే ‘వాబీటా ఇన్ఫో’ తన బ్లాగ్‌లో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ బీటా యూజర్లకు టెస్టింగ్‌ దశలోనే ఉంది. రానున్న రోజుల్లో అందరికీ అందుబాటులోకి రానుంది.మరో కొత్త ఆప్షన్‌..వాట్సప్‌ మరో కొత్త ఫీచర్‌పై పని చేస్తోంది. చాట్‌ లిస్ట్‌లో ఫేవరెట్స్‌ అనే ఆప్షన్‌ను జోడించనుంది. మీకు ఇష్టమైన వ్యక్తుల్ని ఇందులో యాడ్‌ చేసుకోవచ్చు. ఇకపై మీరు తరచూ చాట్‌ చేసేవారు, నచ్చిన వాళ్ల కోసం కాంటాక్ట్స్‌ మొత్తం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ కూడా టెస్టింగ్‌ దశలోనే ఉందని, త్వరలోనే బీటా యూజర్లకు అందుబాటులోకి రానుందని వాబీటా పేర్కొంది.

Related posts

కల్తీ’ మీరు తింటానంటే బెయిలిస్తాం – సుప్రీంకోర్టు

TV4-24X7 News

ముగిసిన గడువు.. ఇవాళ జైలుకు వెళ్లనున్న డిల్లీ సీఎం

TV4-24X7 News

యూజర్లకు జియో మరో షాక్!”

TV4-24X7 News

Leave a Comment