వాలంటీర్ల రాజీనామాలను ఎన్నికలు ముగిసే వరకు ఆమోదించవద్దని దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారించింది. వారి రాజీనామాలు ఆమోదిస్తే వైసీపీకి అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేస్తారని పిటిషనర్ వాదించగా.. రాజీనామా చేసిన వాలంటీర్ల వివరాలు ఇవ్వాలని ఈసీని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి(ఏప్రిల్ 24) వాయిదా వేసింది.
