– వేదమంత్రాలతో కళ్యాణం జరిపించిన అర్చకులు లక్ష్మీ నరసింహమూర్తి,భక్తులందరికీ అన్నదానం
– కడప/మైదుకూరు : దువ్వూరు మండల పరిధిలోని చిన్న సింగన పల్లె గ్రామంలో అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణం నిర్వహించారు. ఆలయ అర్చకులు శ్రీ లక్ష్మీనరసింహ మూర్తి ఆధ్వర్యంలో వేదమంత్రాలతో సీత రాములకు కళ్యాణం నిర్వహించారు. గ్రామంలోని భక్తులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వచ్చిన వారందరికీ ఇలగం రెడ్డి గంగిరెడ్డి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.