Tv424x7
Andhrapradesh

ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్ఆర్ దే

నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 35 వార్డు సలీంనగర్లో వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సోదరి శిల్పారెడ్డి శాసనమండలి స్పీకర్ జకీయా ఖానమ్, కి ఇంటింటా ఆత్మీయ స్వాగతాలు లభించాయి. రాష్ట్రం ముఖ్యమంత్రిజగన్మోహన్ రెడ్డి మాలాంటి పేద ప్రజలకు మంచి చేశారని ఇంతవరకు ఏ నాయకుడు చేయని విధంగా ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటి వద్దకే పంపించి మమ్మల్ని ఆదుకున్నారని అదేవిధంగా ఒకటో తారీఖున ఉదయం 6 గంటలకు పింఛన్ను వాలంటరీ ద్వారా ఇంటికి పంపించిన గొప్ప నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అలాగే ఎమ్మెల్యేశిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నంద్యాలలో ఎవరు చేయనంత అభివృద్ధి చేస్తూ తన సొంత నిధులతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ పేద ప్రజలకు అండగా నిలుస్తున్నారని హర్షం వ్యక్తం చేస్తూ వారికి గెలుపుకు మా వంతు కృషి చేస్తామని ప్రజలు తెలియజేశారు… ఈ సందర్భంగా శిల్పారెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో ముస్లిం లకు 4 శాతం రిజర్వేషన్లు, జగన్ పాలనలో ఉర్దూ ను రెండవ అధికార బాషగా గుర్తింపు చేశారన్నారు. మౌజం, ఇమామ్ లకు గౌరవ వేతనాలను అందిస్తున్నారన్నారు. మైనారిటీ సబ్ ప్లాన్ తదితర ఎన్నో పథకాలును సీఎం జగన్ అందిస్తున్నారని తెలుగుదేశం నాయకులు ఇంతవరకు ముస్లింలకు ఏం చేశారో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని నంద్యాలలో 21 సంవత్సరాలు పదవులు అనుభవించి ప్రజలకు ఏ ఒక్క మంచి కూడా చేయలేకపోయారన్నారు అలాగే అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాల లోనే ఎన్నో సంవత్సరాల నంద్యాల ప్రజల కోరిక నంద్యాల జిల్లా అలాగే 500 కోట్ల రూపాయలతో మెడికల్ కళాశాల అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందుతున్నారని మంచి చేస్తున్న వారికి మీ ఆశీస్సులు మీ అండదండలు అందించాలన్నారు నంద్యాల వైసీపీ అభ్యర్థులుగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి పోటీ చేయుచున్నారని వారికి మీ అమూల్యమైన రెండు ఓట్లను వేసి గెలిపించవలసిందిగా కోరారు, ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భాషిత్, కార్పెంటర్ మౌలాలి, ఆదిల్, పైలెట్ ,కార్పెంటర్ దాదావాలి, కార్పెంటర్ పరాతుల, ఖాన్, మరియు వార్డు వైసిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

Related posts

జీన్స్ ప్యాంట్, బ్లూ షర్ట్.. వైఎస్ జగన్ న్యూలుక్ వైరల్..!

TV4-24X7 News

37 వార్డ్ జబ్బర్ తోట లో పర్యటించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

TV4-24X7 News

జగన్‌దే ఆలస్యం.. నారా లోకేష్‌తో రాజీనామా చేయించే చాన్స్ !

TV4-24X7 News

Leave a Comment