కడప /మైదుకూరు :దువ్వూరులోని పోలీస్ స్టేషన్ ఆవరణము నందు మండలంలోని అన్ని పార్టీ లకు చెందిన నాయకులు , కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మైదుకూరు డి.ఎస్.పి వెంకటేసులు మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి గొడవలు, ఘర్షణలు లేకుండా ఎవ్వరి ఓటును వారు వినియోగించుకోవాలని సూచించారు. ఘర్షణ వాతావరణానికి దిగితే చట్ట పరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే పోలీసులు లక్ష్యంగా సంకల్పించారు. ప్రజల్లో ఉన్న భయాందోళనను పోగొట్టి, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా ప్రశాంత వాతావరణం కల్పించడమే పోలీసుల ధ్యేయమని ప్రజల్లో భరోసా కల్పించారు. దువ్వూరు మండలంలో గత 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికలు గాని 2019లో జరిగిన ఎన్నికల్లో గాని ఎలాంటి సంఘటనలు జరగలేదని 2024 లో కూడా ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకోవాలని అన్ని పార్టీల నాయకులకు సూచించారు , ఈ కార్యక్రమంలో మైదుకూరు రూరల్ సిఐ శ్రీనాథ్ రెడ్డి, దువ్వూరు ఎస్సై శ్రీనివాసులు, స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

previous post