పేదల భూములకు రక్షణ కల్పించేందుకే నీతి అయోగ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను ప్రతిపాదించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అనకాపల్లిలో ఎన్టీఏ కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా గళం సభలో ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమల్లోకి వస్తుందని తెలిపారు.ఈ చట్టంతో ఏళ్ల తరబడి నెలకొన్న భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. కొత్త భూ చట్టాలపై వస్తున్న పుకార్లపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు

previous post