Tv424x7
Andhrapradesh

పోలింగ్ నిర్వహణకు సన్నద్ధం: ముఖేశ్​ కుమార్​ మీనా

రాష్టంలో ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రం 6గంటలకల్లా ముగిసిందని ఎన్నికల కమిషనర్​ ముఖేశ్​ కుమార్ మీనా తెలిపారు. బయటి ప్రాంతాల వారు నియోజకవర్గం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించారు. 13న ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. రాష్ట్రంలోని అరకు, పాడేరు, రంపచోడవరంలో ఇప్పటికే ప్రచారం ముగిసిందన్నారు. పాలకొండ, కురుపాం, సాలూరులో సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. మిగిలిన 169 నియోజక వర్గాల్లో ప్రచారం సాయంత్రం 6 గంటలకు ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్​కుమార్​ మీనా అన్నారు. బయటి ప్రాంతాలవాళ్లు నియోజకవర్గాల నుంచి వెళ్లిపోవాలని ఆయన ఆదేశించారు. పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకు మినహాయింపు ఉంటుందని వెల్లడించారు. రేపు సాయంత్రానికి సిబ్బంది పోలింగ్‌ బూత్‌లకు చేరుకుంటారని, ఎల్లుండి ఉదయం పోలింగ్ సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుందని, అసెంబ్లీ స్థానం పరిధిలోని ఓటరు ఎవరైనా పోలింగ్ ఏజెంట్‌గా ఉండవచ్చు అని సీఈఓ స్పష్టం చేశారు. పోలింగ్ రోజు 200 మీటర్ల దూరంలో ఉండి స్లిప్పులు పంపిణీ చేయవచ్చు అని, స్లిప్పులపై అభ్యర్థి పేరు, గుర్తు ఉండకూడదని ఆదేశించారు. తెల్లటి స్లిప్పులపై ఓటరు పేరు, సీరియల్ నెంబరు ఉండవచ్చని, ఓటర్లను వాహనాల్లో తీసుకురాకూడదు, తిరిగి తీసుకెళ్లకూడదని స్పష్టం చేశారు. పోలింగ్ రోజు ప్రతి అభ్యర్థికీ మూడు వాహనాలు అనుమతిస్తారని, పోలింగ్ బూత్‌లోకి ఫోన్లు తీసుకెళ్లకూడదని తెలిపారు. పోలింగ్ రోజు ఎక్కడా హింసాత్మక ఘటనలు జరగకుండా పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలతో సమీక్షించిన సీఈఓ పోలింగ్ ముందు చివరి 72 గంటల్లో చేయాల్సిన ఏర్పాట్లపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి ప్రచార కార్యక్రమాలు ముగియనున్నట్టు సీఈఓ తెలిపారు. 169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకు, అరకు పాడేరు, రంపచోడవరం నియోజక వర్గాల్లో సాయంత్రం 4 గంటలకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజక వర్గాల్లో సాయంత్రం 5 గంటలకే ప్రచారం ముగిసిందని స్పష్టం చేశారు. 13 తేదీ పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచి రాష్ట్రంలో సైలెన్స్ పీరియడ్ అమలు అవుతుందని వెల్లడించారు. సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ ముగిసేంత వరకూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ 144 సెక్షన్ అమలు అవుతుందని వెల్లడించారు. రాజకీయ పార్టీల ప్రచారం ముగింపుతో పాటు లౌడ్ స్పీకర్లకూ ఆనుమతి లేదని సీఈఓ వెల్లడించారు. డ్రైడే కాలాన్ని పటిష్టంగా అమలు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఉచితాలు, నగదు పంపిణీపై నిఘా పెట్టాలని ఆదేశించారు. ప్రచారాలు ముగిసిన వెంటనే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ నేతలు వెళ్లిపోవాలని స్పష్టం చేశారు.

Related posts

వెస్ట్ నైల్ వైరస్‌‌తో వచ్చేదే.. వెస్ట్‌ నైల్ ఫీవర్

TV4-24X7 News

పెద్దిరెడ్డి కుటుంబం అంతా “అడవిలో” ఇరుక్కున్నట్లే !

TV4-24X7 News

అనంతపురం కో-ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ను … కొల్లగొట్టారా …❓

TV4-24X7 News

Leave a Comment