Tv424x7
Andhrapradesh

నంద్యాల ఎస్పీ రఘువీరా రెడ్డి పై చర్యలకు ఈసీ ఆదేశం

నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమల్లో విఫలమైన ఎస్పీపై ఛార్జెస్ ఫైల్ చేయాలని ఈసీ ఆదేశించింది. ఎస్పీతో పాటు ఎస్ఓపీవో రవీంద్రనాథ్డ్డి, సీఐ రాజారెడ్డిపైనా శాఖాపరమైన విచారణ జరపాలని డీజీపీకి ఉత్తర్వులు జారీ చేసింది.ఏం జరిగిందంటే?నంద్యాలలో సినీ నటుడు అల్లు అర్జున్ పర్యటన వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఆయన పర్యటనకు రిటర్నింగ్ అధికారి ముందస్తు అనుమతులు ఇవ్వలేదు. నంద్యాల ఎమ్మెల్యే, వైకాపా అసెంబ్లీ అభ్యర్థి శిల్పా రవిచంద్రకిశోర్రెడ్డి ఇంటికి శనివారం ఉదయం అల్పాహారానికి అల్లుఅర్జున్ వచ్చారు. వైకాపా శ్రేణులు వ్యూహాత్మకంగా పట్టణ శివారు నుంచే భారీ వాహనాలు, మోటారు సైకిళ్లతో ప్రదర్శనగా పట్టణంలోకి ఆయనను తీసుకువచ్చాయి. ఆయన పర్యటనకు అధికారిక అనుమతులూ లేకపోయినా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ విషయాన్ని కొందరు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉండగా ఇంచుమించు అదే సమయంలో హీరో అర్జున్ పర్యటన ఉండటంతో జిల్లా కేంద్రంలో కొంతసేపు ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై ఫిర్యాదులు అందడంతో ఎన్నికల సంఘం స్పందించింది.

Related posts

పేద కుటుంబానికి ఐదు వేలు సాయం చేసిన వాసుపల్లి

TV4-24X7 News

పల్నాడు జిల్లాలో తనిఖీలు.. వైకాపా నేతలు ఇళ్లలో పెట్రోల్ బాంబులు

TV4-24X7 News

సంక్రాంతి సెలవులు మరో మూడు రోజులు పొడిగింపు.

TV4-24X7 News

Leave a Comment