Tv424x7
Andhrapradesh

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం

పల్నాడు జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిలకలూరిపేట- పర్చూరు జాతీయ రహదారిపై టిప్పర్ లారీ, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్నాయి. ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో రెండు వాహనాలు పూర్తిగా దగ్దం అయ్యాయి. ఇద్దరు డ్రైవర్లు సహా ఆరుగురు సజీవ దహనం అయ్యారు. ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిచారు. ట్రావెల్స్ బస్సు బాపట్ల జిల్లా చినగంజాం నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం ఈ ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది . ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతులు చినగంజా, గోనసపూడి, నీలాయపాలెం వాసులుగా గుర్తించారు. వీరంతా ఓటు వేసేందుకు వచ్చి హైదరాబాద్ వెళ్తున్నా రు. మృతుల్లో నలుగురిని గుర్తించారు. వీరులో డ్రైవర్ అంజి, ఉప్పుగుండూరు కాశి, ఉప్పుగుండూరు లక్ష్మీ, ముప్పరాజు ఖ్యాతి సాయిశ్రీ ఉన్నారు.

Related posts

ఏపీలో ఆరోగ్యశ్రీ కింద రూ.25 లక్షల వైద్య సాయం: మంత్రి సత్యకుమార్

TV4-24X7 News

ఏడుగుళ్ళ ప్రాంత నివాసితులకు పక్కా గృహాలు నిర్మించాలి కందుల నాగరాజు

TV4-24X7 News

ఆలపాటి రాజా వర్సెస్ నాదెండ్ల మనోహర్..!

TV4-24X7 News

Leave a Comment