Tv424x7
Telangana

పోలీస్ స్టేషన్ ఎదుట సీఐ భార్య ఆందోళన

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఎస్‌ఐ నాగరాజు తనకు తెలియకుండా రెండో వివాహం చేసుకున్నాడని, పిల్లలను బలవంతంగా తీసుకెళ్లాడని అతడి మొదటి భార్య మానస కొమురవెల్లి పోలీ్‌సస్టేషన్‌ ఎదుట తల్లి, బంధువలతో కలిసి ఆందోళనకు దిగింది.నాగరాజు రెండో భార్య వల్ల తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉందని, పోలీసులు తనకు న్యాయం చేయాలని ఆమె కోరుతోంది. బాధితురాలి కథనం ప్రకారం..కరీంనగర్‌ జిల్లా గోపాలపురానికి చెందిన మానసకు కొమురవెల్లి ఎస్‌ఐ నాగరాజుతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులున్నారు. సుమారు రెండేళ్ల క్రితం ఎస్‌ఐ నాగరాజు మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని మానసను వేధిస్తున్నాడు.కొంతకాలం క్రితం మానసను, పిల్లలను కరీంనగర్‌లో ఉంచాడు. అప్పుడప్పుడు అక్కడికి వచ్చిపోయేవాడు. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండు నెలల క్రితం బలవంతంగా పిల్లలను తీసుకెళ్లి.. వాళ్లు ఎక్కడున్నారో మానసకు చెప్పడం లేదు.అలాగే, విడాకులు ఇవ్వాలని వేధించడంతో మానస ఆత్మహత్యాయత్నం చేసుకుంటానని ఆమె సూసైడ్‌ నోట్‌ రాసింది. కుటుంబ సభ్యులు కలగ జేసుకుని న్యాయం చేస్తామని చెప్పడంతో విరమించుకుంది. ఈ విషయాన్ని సిద్దిపేట సీపీ, చేర్యాల సీఐ, కరీంనగర్‌ మహిళా పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని బాధితురాలు వాపోయింది.తనకు, తన ఇద్దరు పిల్లలకు ఎస్‌ఐ నాగరాజు, రెండో భార్యతో ప్రాణహాని ఉందని, నాగరాజు.. పిల్లలు తనతో కలిసి ఉండేలా న్యాయం చేయాలని ఆమె మంగళవారం కొమురవెల్లి పోలీ్‌సస్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగింది. అయితే, ఎస్‌ఐ నాగరాజు సెలవులో ఉన్నారని సిబ్బంది చెప్పారు.తనకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన చేస్తానని ఆమె పేర్కొంది. ఈ విషయమై సీఐ శ్రీనును సంప్రదించగా, విషయాన్ని మానన ఇటీవల తమ దృష్టికి తీసుకువచ్చారని.. కౌన్సెలింగ్‌ ఇచ్చామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Related posts

హైడ్రాకు ఇక తిరుగులేదు.. ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం

TV4-24X7 News

ఆ ఫైళ్ల మాయంపై విచారణ వేగవంతం చేశాం

TV4-24X7 News

కేసీఆర్, హరీశ్ రావు, ఈటలకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు..!!

TV4-24X7 News

Leave a Comment