Tv424x7
Andhrapradesh

శ్రీశైలంలో అరుదైన జంతువు.

నంద్యాల జిల్లా శ్రీశైలం ఆలయంలోని క్యూలైన్లలో పునుగుపిల్లి కలకలం రేపింది. స్వామివారి దర్శనానికి వెళ్లే మార్గంలో.. మూడు వందల దర్శనం టికెట్ క్యూలైన్లలో ఒక్కసారిగా పై నుంచి పునుగుపిల్లి కిందపడింది. దీంతో ఒక్కసారిగా శబ్ధం రావడంతో.. క్యూలైన్లలో ఉన్న భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో పరుగులు తీస్తున్న పునుగు పిల్లిని చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ముందు ఏదో ప్రమాదకర జంతువు అనుకొని భయపడ్డారు.. ఆ తర్వాత పునుగుపిల్లి అని తెలిసి వింతగా చూశారు. ఈ సందర్భంగా కొందరు భక్తులు తమ ఫొన్లలో బంధించుకున్నారు.అయితే.. క్యూలైన్లలో పునుగుపిల్లి అటుఇటు తిరుగుతూ ఎటు పోవాలో అర్ధంగాకా క్యూలైన్లలోని జాలిలోనుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది.. చివరకు సెక్యూరిటీ సిబ్బంది పునుగుపిల్లిని పట్టుకుని బయట వదిలేశారు.అయితే.. శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోసం వచ్చి.. పునుగుపిల్లిని రియల్ గా చూడటం ఇదే మొదటిసారని భక్తులు పేర్కొన్నారు. సాధారణంగా పునుగుపిల్లులు అడవులలో నీటి వడ్డున సంచరిస్తుంటాయి. అలాంటిది.. పునుగుపిల్లి ఆలయ క్యూలైన్లలో ప్రత్యక్షం కావడంతో భక్తులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

Related posts

ఓకే ఒక్క పోస్టుతో జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ సస్పెండ్…

TV4-24X7 News

అరుణాచలం గిరి ప్రదక్షణ భక్తులకు అన్నదానం నిర్వహించిన వివేకానంద సంస్థ

TV4-24X7 News

శ్రీశైలం జలాశయానికి మళ్లీ భారీ ఇన్‌ఫ్లో.. నాలుగోసారి గేట్లు ఎత్తిన అధికారులు!

TV4-24X7 News

Leave a Comment