Tv424x7
National

చత్తీస్‌గఢ్‌లో ఘోరం గన్‌పౌడర్‌ ఫ్యాక్టరీలో పేలుడు 17మంది దుర్మరణం..

ఛత్తీస్‌గఢ్‌లో శనివారం ఉదయం ఘోరం జరిగింది. బెమెతారా జిల్లా బెర్లా బ్లాక్‌లోని బోర్సీ గ్రామంలో గన్‌పౌడర్‌ తయారీ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది..ఈ ఘటనలో 17 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో బిల్డింగ్‌ మొత్తం కుప్పకూలింది. దాంతో పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులంతా భవన శిథిలాల కింద చిక్కుకున్నారు..ఫ్యాక్టరీలో పేలుడు శబ్ధం వినిపించగానే స్థానికులు ఉలిక్కిపడ్డారు. వెంటనే ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. 17 మృతదేహాలను శిథిలాల నుంచి బయటికి తీసి పోస్టుమార్టానికి పంపించారు. పలువురు తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు..

Related posts

తమిళనాడులో కళ్ల ముందే కుప్పకూలిన ఇల్లు

TV4-24X7 News

ప్రమాదకర స్థాయికి భారత్‌ అప్పులు..

TV4-24X7 News

వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు..!

TV4-24X7 News

Leave a Comment