ప్రముఖ జ్యోతిషుడు వేణు స్వామి గురించి తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండరంటే అతిశేయోక్తి కాదు. సినీ , రాజకీయ ప్రముఖుల జాతకాల గురించి చెబుతూ బాగా ఫేమస్ అయ్యరాయన.ముఖ్యంగా నాగ చైతన్య, సమంత జంట వీడిపోతారని ముందుగానే చెప్పి సంచలనం సృష్టించారు. వీరితో పాటు పలువురు సెలబ్రిటీల గురించి వేణు స్వామి చెప్పినవి చెప్పినట్టుగా జరగడంతో..సోషల్ మీడియాలో ఆయన పెద్ద సెలబ్రిటీగా మారిపోయారు.2024 ఎన్నికల్లో ఏపీలో మళ్లీ జగనే సీఎం అవుతారని వేణు స్వామి చాలా ఇంటర్య్వూలో చెప్పుకొచ్చారు. ఎంతమంది కలిసి వచ్చిన జగన్‌ను ఓడించలేరని ఆయన తెలిపారు. తాజాగా ఆయన ఇచ్చిన మరో ఇంటర్య్వూలో కూడా ఏపీకి జగనే సీఎం అని పునరుద్ఘటించారు. దీనిపై యాంకర్ మాట్లాడుతూ… ఏపీని అప్పుల ఊబిలోకి నెట్టారని.. రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ది జరగలేదని ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే జగన్ ఓడిపోతారని ప్రతిపక్షాలు అంటూంటే మీరు… మీళ్లీ జగనే సీఎం అని అంటున్నారు ఏంటని వేణు స్వామిని ప్రశ్నిస్తారు. నేను రోజుకో మాట మాట్లాడానికి రాజకీయ విశ్లేషకుడును కాదని.. జ్యోతిషుడనని ఒక్కసారి చెప్పిన మాట మీదే తాను నిలబడతానని ఆయన వేణు స్వామి తెలిపారు.టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత వైసీపీ విజయం ఖాయమైందని వేణు స్వామి వ్యాఖ్యనించారు. సర్వేలు, అందరు ఇప్పుడు జగన్ సీఎం అవుతారని చెబుతున్నారని..కానీ తాను మొదటి నుంచి కూడా జగనే సీఎం అని చెబుతున్నారనని ఆయన చెప్పుకొచ్చారు.ఎవరెన్ని చెప్పినా 2024లో జగనే సీఎం అవుతారని వేణు స్వామి కుండబద్దలు కొట్టేశారు. జాతకరీత్య జగన్ మళ్లీ సీఎం అవుతారని.. చంద్రబాబు ఇక ఎప్పటికీ సీఎం కాలేరని వేణు స్వామి తేల్చి చెప్పారు. జగన్ జాతకంలో బుధ మహర్దశ ప్రవేశించిందని.. మరో 17 ఏళ్లు ఆయన్ను కదిలించే శక్తి ఏది లేదని వేణు స్వామి చెప్పుకొచ్చారు. అంటే మరో 17 సంవత్సరాల పాటు జగనే ఏపీకి సీఎంగా ఉంటారని ఆయన తెలిపారు. 2019 గెలిచిన జగన్ 2024,2029 ఎన్నికల్లో కూడా గెలుచి సీఎం అవుతారని వేణు స్వామి తెలిపారు.

previous post