విశాఖపట్నం /విశాఖ దక్షిణ నియోజకవర్గం, 31వ వార్డ్, కృష్ణగార్డెన్స్ లో కొలచల వెంకట నరసింహం అనే బ్రాహ్మణవర్గానికి చెందిన వ్యక్తి బ్రతుకుతెరువుకై వాచ్ మాన్ గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తన కుటుంబ ఆర్దికపరిస్థితుల దృష్ట్యా 31వ వార్డ్ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బత్తిన నవీన్ కుమార్ ని సహాయంకోరగా అందుకు స్పందించి ఈరోజు 31వ వార్డ్ యువ నాయకులు బత్తిన నవీన్ కుమార్ వారి కుటుంబానికి ఆర్థికసహాయం అందజేశారు. ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు అర్జీ శంకర్రావు , వేణు , జితేందర్ , మణికంఠ , రాజేష్ మరియు రమేష్ పాల్గొన్నారు.

previous post