విశాఖపట్నం డీసీపీ ఎం.సత్తిబాబు ఆధ్వర్యంలో ఎన్నికల అనంతరము కౌంటింగ్ నిమిత్తం చేపడుతున్న చర్యలపై దక్షిణ నియోజకవర్గ వివిధ రాజకీయ పార్టీల నాయకులుకు,ప్రజలకురెళ్లివీధి, అంబేడ్కర్ కల్యాణ మండపంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.కార్యక్రమంలో ఏసీపీ మోసిస్ పాల్, 1టౌన్ సి ఐ భాస్కర రావు,2టౌన్ సి ఐ బి.తిరుమల రావు,ఎం.ఆర్.పేట సి.ఐ మరియు సిబ్బంది పి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.కార్యక్రమంలో డిసిపి సత్తిబాబు మాట్లాడుతూ.ఇప్పటి వరకు ఎన్నికల ప్రక్రియ సజావుగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి చేయడం జరిగింది ఓట్ల లెక్కింపు కార్యక్రమం 4వ తేదీన ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించబోతున్నాము ఆ ప్రక్రియ కూడా ప్రశాంతంగా పూర్తి అయ్యేందుకు ప్రజల సహకరించాలి నియోజకవర్గ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు బలగాలతో గట్టి పోలీసు భద్రత ఏర్పాటు చేయడం జరిగినది 3వతేదీ నుండి 5వ తేదీ వరకు మద్యం దుకాణాలు మూసి వేయబడతాయి, అనధికార మద్యం అమ్మకాలు నిషేధం 144 సెక్షన్ అమలులో ఉంటుంది ఏ అభ్యర్థికి,ఏ రాజకీయ పార్టీల వారికి విజయోత్సవం అనంతరం ర్యాలీలకు అనుమతులు లేవు కావున ఎవరైనా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుంది కావున ప్రజలందరూ అవాంఛనీయంగా సంఘటనలు జరగకుండా పోలీస్ వారికి సహకరించాలి.

previous post
next post