ఏపీ : మాజీ మంత్రి కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ శ్రేణులు గుడివాడలోని ఆయన ఇంటి వద్ద హల్ చల్ చేశాయి. కొడాలి నాని ఇంటిపై కోడిగుడ్లు విసురుతూ ‘దమ్ముంటే బయటకి రా’ అంటూ సవాల్ విసిరారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకుని టీడీపీ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించారు. ‘పోలీసులు లేకపోతే నీది కుక్క బతుకు. బయటకు రా.. లోకేశ్ ఆధ్వర్యంలో నీకు అంకుశం సినిమా చూపిస్తాం’ అని హెచ్చరించారు.