తమకు హో దా సేవ కోసం తప్ప పెత్తనం కోసం కాదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ‘అహంకారం పనికి రాదు. సీఎం వస్తున్నాడంటే గతంలో మాదిరిగా చెట్లు కొట్టేయడం, రోడ్లు మూసేయడం, షాపులు బంద్ చేయడం, పరదాలు కట్టుకోవడం ఉండవు. సీఎం కూడా మామూలు మనిషే. మామూలు మనిషిగానే జనంలోకి వస్తా. అందరితో కలిసి ఉంటా. నా కోసం ట్రాఫిక్ ఆపి ప్రజలకు ఇబ్బందులు కల్గించవద్దని అధికారులను ఆదేశించా’ అని CBN తెలిపారు.
రాజధానిపై చంద్రబాబు కీలక ప్రకటన ఆంధ్రప్రదేశకు అమరావతి రాజధానిగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘విశాఖను ఆర్థిక రాజధాని, ఆధునిక నగరంగా అభివృద్ధి చేసుకుందాం. ఆనాటి సీఎం విశాఖను రాజధానిగా చేస్తానంటే నువ్వు రావొద్దని ప్రజాతీర్పు ఇచ్చిన నగరం విశాఖ. కర్నూలును న్యాయరాజధానిగా చేస్తామని చివరికి ఏమీ చేయలేదు. రాయలసీమలో తక్కువ సీట్లు వస్తాయని తొలుత భయపడ్డాను. కానీ అక్కడా కూటమికి మంచి సీట్లు వచ్చాయి’ అని చెప్పారు.