విశాఖపట్నం : ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ దక్షిణ నియోజకవర్గం పరిధిలోగల కోటవీధి ఈద్ గాహ్ వద్ద బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులతో కలసి సాముహిక నమాజ్ లో పాల్గొన్నారు. త్యాగం,సహనం ఈ పండుగ ద్వారా అందించే మంచి సందేశం అని అన్నారు. ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ, కరుణ, ఐక్యత తో భక్తి శ్రద్ధలతో పండుగ ఆనందంగా జరుపుకుంటారని అన్నారు. అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ వుండాలని ఆకాంక్షించారు. నమాజ్ అనంతరం ఒకరికి ఒకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, స్థానిక వార్డ్ నాయకులు పాల్గొన్నారు.

previous post
next post