Tv424x7
Telangana

రెండు రోజులు బంద్ ప్రకటించిన ఏబీవీపీ

హైదరాబాద్:జూన్ 25తెలంగాణ రాష్ట్రంలో జూన్ 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పున ప్రారంభమయ్యాయి. అయి తే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించా లని, అటు ప్రైవేటు పాఠ శాలల్లో అధిక ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ABVP రెండు రోజు లు పాటు స్కూళ్లలను బంద్ పెట్టాలని పిలుపునిచ్చింది. జూన్, 25, 26వ తేదీల్లో పాఠశాలల బంద్ నిర్వహి స్తున్నట్లు తెలిపింది. స్కూల్స్ ప్రారంభమై 15 రోజులు పూర్తయినా పుస్తకాలను మాత్రం ఇంకా పంపిణీ చేయకపోవడం, విద్యార్థుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోం దని ఏబీవీపీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాల ని..పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. విద్యాసమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తోంది. ABVP..రాష్ట్రంలో ఖాళీగా ఉన్న డీఈవో, ఎంఈవో పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుతోంది. అనుమతులు లేకుండా కొనసాగుతున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని సూచించింది. బంద్ కు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. స్కూళ్లలను స్వచ్చందంగా బంద్ చేయాలని కోరారు.

Related posts

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఆర్థిక ఇందన ప్రణాళిక శాఖ మంత్రిత్వ శాఖల బాధ్యత

TV4-24X7 News

10వ, 12వ తరగతుల సీబీఎస్సీ బోర్డు పరీక్షల షెడ్యూల్‌ 2024 విడుదల

TV4-24X7 News

ఉపాధ్యాయులతోనే సమగ్ర ఇంటింటి కులగణన.. భట్టి కీలక వ్యాఖ్యలు..!!

TV4-24X7 News

Leave a Comment