Tv424x7
Telangana

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ స్పీడప్ చేయడంతో ఎమ్మెల్యేల వలసల పర్వం ఇప్పటి వరకు ఆరుకు చేరింది. తాజాగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి సైతం పార్టీ మారేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్తో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, ఆషాడ మాసం ప్రారంభంలోనే ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల నియోజకవర్గ పర్యటనలో ఆమె మంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘హోం శాఖ, విద్యాశాఖలను మీ కోసమే ఖాళీగా ఉంచారేమో మేడమ్.. మీరు వెళ్తే మీకే ఆ శాఖ ఇస్తారేమో..’ అని ఓ రిపోర్టర్ నవ్వుతూ వ్యాఖ్యానించగా మంత్రి పదవి కావాలంటే అదృష్టం ఉండాలని, నుదుటి రాత బాగాలేకుంటే ఏమీ చేయలేమని సరదాగాబదులిచ్చారు. అయితే బీఆర్ఎస్ అధికారంలోలేనందున మంత్రి పదవి సాధ్యం కాదనిచెప్పకుండా అదృష్టం ఉండాలనివ్యాఖ్యానించడంతో త్వరలోనే ఆమె కాంగ్రెస్తీర్థం పుచ్చుకోవడం ఖాయం అనే చర్చజరుగుతోంది.కుమారుడికి కీలక పదవి❗గతంలో కాంగ్రెస్లో ఉన్న సబితాఇంద్రారెడ్డి హోం మంత్రిగా పనిచేశారు. 2019లో కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి కొట్టేశారు. అయితే బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఆమె పార్టీ మారేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి సైతం కాంగ్రెస్లో చేరబోతున్నారని, అతడికి నామినేటెడ్ పోస్టును సైతం కాంగ్రెస్ ఆఫర్ చేసిందనే ప్రచారం జరుగుతోంది…

Related posts

A.P & T.S Live Update News

TV4-24X7 News

కులగణన కార్యాచరణ ప్రారంభించండి..!!

TV4-24X7 News

రూ.250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్

TV4-24X7 News

Leave a Comment