Tv424x7
National

దేశవ్యాప్తంగా పలు కాలేజీలు, పాఠశాలలు నేడు సెలవు ఇచ్చాయి.

జులై 4, గురువారం నాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) ఇచ్చిన భారత్ బంద్ పిలుపు మధ్య హైదరాబాద్‌లోని పాఠశాలలు, కళాశాలలు సెలవు ప్రకటించాయి.దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు నీట్-యుజి అభ్యర్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఒత్తిడి చేస్తున్నాయి. కేంద్ర వ్యవహార శైలికి నిరసనగా విద్యాసంస్థల బంద్ కు పిలుపు నిచ్చాయి.బంద్‌ పిలుపులో భాగంగా హైదరాబాద్‌లోని అనేక పాఠశాలలు, కళాశాలలు పాఠశాలల మూసివేస్తున్నట్లు వాట్సాప్ నోటిఫికేషన్‌లు, సర్క్యులర్‌ల ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశాయి. కొన్ని విద్యాసంస్థలు ఇంకా సెలవు ప్రకటించలేదు. మంగళవారం హైదరాబాద్‌లో విద్యార్థి సంఘాలు, ఎస్‌ఎఫ్‌ఐ, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ (పీడీఎస్‌యూ) జాతీయ నాయకులు పాఠశాలలు, కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చారు. ఉన్నత విద్యాసంస్థల్లో రాజకీయ ప్రమేయాన్ని నిరసిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది.విద్యార్థులు, విద్యార్థి నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని కోరారు. నీట్ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయని, దానిని రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ 24 లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాలలో పాఠశాలలు, కళాశాలల బంద్‌ను విజయవంతం చేసేందుకు తల్లిదండ్రులు తమ ఆందోళనలో పాల్గొనాలని నాయకులు అభ్యర్థించారు. పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించేలా తల్లిదండ్రులను ఒప్పించాలని కోరారు.మరోవైపు నీట్ వ్యవహారంపై ప్రధాన మంత్రి మోదీ స్పందించారు. పేపర్ లీక్ కేసులో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదన్నారు. సుప్రీం కోర్టులో కూడా నీట్ వ్యవహారం పై విచారణ జరుగుతోంది.

Related posts

భార్య అందంగా తయారవుతోందని చంపేశాడు!

TV4-24X7 News

సరిహద్దులో పాక్ సైన్యం కాల్పులు… దీటుగా సమాధానం ఇచ్చిన భారత ఆర్మీ

TV4-24X7 News

శ్రీలంక పర్యటన.. నేడే భారత జట్టు ప్రకటన!

TV4-24X7 News

Leave a Comment