మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు కడప జిల్లా పర్యటనకు రానున్నారు. అనంతరం 8వ తేదీన తన తండ్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద నివాళులర్పించేందుకు ఆయన రేపు సాయంత్రం కడప రానున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి విమానం ద్వారా కడపకు చేరుకొని రోడ్డు మార్గాన ఇడుపులపాయ వెళ్తారని కడప మేయర్, జిల్లా వైసీపీ అధ్యక్షుడు సురేశ్ బాబు తెలిపారు.

previous post