హైదరాబాద్: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సోమవారం తెలంగాణ హైకోర్టు (Telangana High Court) విచారణ చేయనుంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagendar), స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari), తెల్లం వెంకట్రావు (Tellam Venkatravu), భద్రాచలం ఎమ్మెల్యేల పిటిషన్‌లపై ఈరోజు హైకోర్టు విచారణ చేస్తుంది.బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు ప్రకటించాలని కోరుతూ కూకట్పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం ఈరోజు విచారణ చేయనుంది.కాగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ గౌడ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పులున్నా పరిగణలోకి తీసుకోవడంలేదన్నారు. పిటీషనర్ల తరఫు న్యాయవాదులు. దీనిపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై జులై 3న హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను సోమవారం నాటికి వాయిదా వేసింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారని.. వారిని అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ కూకట్పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్, హుజూరాబాద్ శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డిలు కొద్ది రోజుల క్రితం వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

next post