హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కన్వీ నర్ కోటాలో 70,307 ఇంజ నీరింగ్ సీట్లు ఉన్నాయని సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్సిటీ లలో 7,153 ఇంజినీరింగ్ సీట్లు ఉన్నాయని తెలిపింది. రెండు ప్రైవేటు వర్సిటీల్లో 1,260 సీట్లు ఉ న్నాయని వెల్లడించింది. ఈ విద్యాసం వత్సరం జెఎన్‌టియుహెచ్, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ వర్సిటీతో పాటు ప్రైవేట్ యూనివర్సిటీలలో మొత్తం 98,296 సీట్లు అందుబాటులో ఉండగా,70 శాతం కన్వీనర్ కోటా కింద 70, 307ఇంజినీరింగ్ సీట్లు ఉన్నాయని స్పష్టం చేసింది. అత్యధికంగా సిఎస్‌ఈలో 21,599.. ఇసిఇ లో 10, 398 సీట్లు ఉన్నట్లు సాంకే తిక విద్యాశా ఖ వెల్లడిం చింది. అలాగే సిఎస్‌ఇ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్,లో 11, 196 సీట్లు, తో పాటు..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డాటా సైన్స్‌లో 1365 సీట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్‌లో 606 సీట్లు, సిఎస్‌ఇ,సైబర్ సెక్యూరిటీ ఇంక్లూడింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ,లో 126 సిఎస్‌ఇ, సైబర్ సెక్యూరిటీ, లో 1,3 44 సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది.ఇంజనీరింగ్ సీట్లలో ఈ విద్యాసంవత్సరం సంప్రదా య బ్రాంచీలైన సివిల్ ఇంజనీరింగ్‌లో 3231 సీట్లు అందుబాటులో ఉండగా, మెకానికల్ ఇంజనీరింగ్‌లో 2979 సీట్లు అందుబాటు లో ఉన్నాయి. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 3705, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో 4202 సీట్లుఅందుబాటు లోఉన్నట్లు సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది.రాష్ట్రంలో 19 యూనివ ర్సిటీ కాలేజీల్లో 5,343 ఇంజినీరింగ్ సీట్లు అందుబా టులో ఉండగా, అందులో అత్యధికంగా జెఎన్‌టియు హెచ్‌లోని తొమ్మిది కాలేజీ ల్లో 3,150 సీట్లు అందుబా టులో ఉన్నాయి..

previous post