Tv424x7
Andhrapradesh

కొల్లి సింహాచలం ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతోత్సవ వేడుకలు

విశాఖపట్నం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం మాజీ చైర్మన్, 39వ వార్డు వైఎస్సార్సీపీ ఇంచార్జ్ కొల్లి సింహాచలం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 39వ వార్డు, లక్ష్మీ టాకీస్ జంక్షన్లో మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, వైఎస్సార్సీపి రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, కొల్లి సింహాచలం, సనపల రవీంద్ర భరత్, బాబ్జి, ముజీబ్ ఖాన్ తదితరులు మహానేత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ ని కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పేదలకు పళ్ళు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపి ముఖ్య నాయకులు అప్పారావు, సలీం, సతీష్, పోలరాజు, పైడిరత్నం, నాగమణి, కనక దుర్గ, బంగారి, అనిల్, బుజ్జి, మసేను, రవి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

వాలంటీర్ల రాజీనామాలు.. కోర్టు కీలక ఆదేశాలు

TV4-24X7 News

ఏపీలో అపార్ గుర్తింపు 62 శాతం పూర్తి

TV4-24X7 News

వి ఎం ఆర్ డిఎ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టిన ప్రణవ గోపాల్ కి శుభా కాంక్షలు తెలిపిన విల్లూరి

TV4-24X7 News

Leave a Comment