Tv424x7
Telangana

మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో భారీ షాక్

ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీఆర్ఎస్‌ను వీడారు 15 మంది కార్పొరేటర్లు. దీంతో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ బలం మరింత పెరిగింది. త్వరలోనే ఫిర్జాదిగూడ కార్పొరేషన్ హస్తగతం కానుంది. అయితే, ఈ 15 మంది కార్పొరేటర్లతో డిప్యూటీ మేయర్ శివకుమార్ ఆధ్వర్యంలో గోవాలో క్యాంప్ రాజకీయం నడుపుతున్నారు. మొన్న జవహర్ నగర్, నిన్న బోడుప్పల్ కాంగ్రెస్ కైవసం అయ్యాయి.అదే బాటలో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కూడా హస్తగతం కానుంది.ఇదిలాఉండగా.. ఎమ్మెల్యేలే పార్టీలు మారుతున్న వేళ కార్పొరేటర్లు సైతం తామెంత అనుకుంటూ బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇక్కడ మరో ప్రచారం కూడా జరుగుతోంది. గత కొంత కాలంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జరిగింది. ఇటీవల కాలంలో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 15 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మల్లారెడ్డే వెనుక ఉండి ఇదంతా నడిపిస్తున్నారా.? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Related posts

తెలంగాణ స‌భా స‌మ‌రం ముహూర్తం రెడీ..!

TV4-24X7 News

తొలి తెలుగు న్యూస్‌ రీడర్‌ శాంతి స్వరూప్‌ (Shanti Swaroop) కన్నుమూత

TV4-24X7 News

అన్నలను మెప్పించిన కేసీఆర్‌ సంక్షేమం..!!

TV4-24X7 News

Leave a Comment