Tv424x7
Andhrapradesh

సినిమా టిక్కెట్ ధరలు పెంచే అధికారం ప్రభుత్వానికి ఉందా…. లేదా…?

సినిమా టిక్కెట్ ధరలు పెంచే అధికారం ప్రభుత్వానికి ఉందో లేదో తేలుస్తాం: ఏపీ హైకోర్టు*జులై 11,2024కొత్త సినిమాల టిక్కెట్ల ధరలు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా అనే అంశంపై లోతైన విచారణ చేస్తామని ఏపీ హైకోర్టు తాజాగా పేర్కొంది. ఈ అంశంపై పూర్తి వివరాలతో కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని, ఇతర ప్రతివాదులను ఆదేశించింది. సినిమా టిక్కెట ధరల విషయంలో గతంలో దాఖలైన వ్యాజ్యంతో ప్రస్తుత పిల్‌ను జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించిందిహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఎన్. జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. కల్కి సినిమా ధనలను 14 రోజుల పాటు పెంచుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ పి. రాకేశ్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిల్ వేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక న్యాయవాది ఎన్. ప్రణతి వాదనలు వినిపిస్తూ.. పూర్తి వివరాలతో కౌంటర్ వేసేందుకు మరికొంత సమయం కావాలని అన్నారు.

Related posts

శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

TV4-24X7 News

నంద్యాలలోని సమస్యలన్ని సమూలంగా పరిష్కరిస్తాం

TV4-24X7 News

ఎందుకు ఓడిపోయాం..! ఏమైంది..?

TV4-24X7 News

Leave a Comment