విశాఖపట్నం దేశ రాజధాని న్యూ ఢిల్లీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి విశాఖ సౌత్ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ హాజరయ్యారు. ఏపీలో కూటమి పార్టీలు చేస్తున్న ధ్వంసరచనకు నిరసనగా జగన్ అధ్యక్షతన బుధవారం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టనున్న విషయం తెల్సిందే. కార్యక్రమంలో సౌత్ కార్పొరేటర్లు, వార్డ్ ప్రెసిడెంట్ లు నాయకులు పాల్గొన్నారు.
