విశాఖపట్నం వన్ టౌన్ స్టేషన్ ట్రాఫిక్ పోలీసులు ఆదివారం రాత్రి కొత్త రోడ్ పరిసర ప్రాంతల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ ఎస్ ఐ విశ్వనాధ్ నేరుగా పలువురు వాహనదారులకు ఈ పరీక్షలుచేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దని సూచించారు. తమపై ఆధార పడిన తల్లి దండ్రులు, భార్యాపిల్లలకు విషాదాన్ని మిగల్చవద్దని వాహనదారులకు సూచించారు. ఈకార్యక్రమంలో వన్ టౌన్ ట్రాఫిక్, సిబ్బంది పాల్గొన్నారు.
