విశాఖపట్నం భార్యను వేధిస్తున్న వ్యక్తిని ప్రశ్నించిన కానిస్టేబుల్ పై తీవ్రంగా దాడి చేసి, ఇష్టారీతిన వ్యవహరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎంవీపీ స్టేషన్ లో ఈ మేరకు ఎస్ఐ శ్రీనివాస్ తో కలిసి సీఐ సంజీవరావు మీడియాకు వివరాలు వెల్లడించారు. గత నెల 29న ఆదర్శనగర్ కు చెందిన కింతాడ కనక మహాలక్ష్మి అనే మహిళ తన భర్త కొర్రయ వినయ్ గొడవచేస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బ్లూ కోల్ట్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ రాజు నాయుడు, హెడ్ కానిస్టేబుల్ గోవిందరావు, పీసీ సందీప్సంఘటనా స్థలానికి వెళ్లారు. అయితే వినయ్ పోలీసులపై తిరగబడి తీవ్రంగా దూషించాడు. రాజు నాయుడిపై పిడిగుద్దులు గుద్దడంతో అతని కంటి వద్ద, మోచేతిపైనా తీవ్ర గాయాలయ్యాయి. ఇతర కానిస్టేబుళ్లుఎంతగా చెబుతున్నా వినయ్ వెంటబడి మరీ రాజును కొట్టాడు.భార్యభర్తలకు గతంలోనూ రాజు నాయుడు పలుమార్లు కౌన్సెలింగ్ చేయడంతో కక్ష కట్టిన వినయ్ దాడికి పాల్పడ్డాడని తరవాత తేలింది.తాజాగా కూడా వినయ్ మారణాయుధాలతో రాజు ముఖంపై రెండుసార్లు కొట్టాడు. అంతే కాకుండా కింద పడిపోయిన రాజు నాయుడు కానిస్టేబుల్ చాతిపైనా వినయ్ కూర్చొని పీక పట్టుకొని చంపేస్తానంటూ బెదిరించాడు. గోవింద, సందీప్ వారిస్తున్నా వినయ్ వినలేదు. రాజును చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. బాధిత కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే సంఘటన అనంతరం వినయ్ పరారీలోనే ఉన్నాడు. గత నెల 31న మళ్లీ చిక్కడంతో వినయ్ ను అరెస్ట్ చేసి, ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.

next post