Tv424x7
Telangana

కోట్లు వసూలు చేసిన ప్రైవేట్ లిమిటెడ్ ఉందా…? మూసేశారా?

కనపడని ప్రైవేట్ లిమిటెడ్..ఒక షాప్ పై తెల్లటి రంగుతో తుడిచివేత.. మరొక షాప్ పై ఫ్లెక్సీ తీసివేత కంపెనీ ఉన్నట్లా..?.. లేనట్లా..?

జోగులాంబ గద్వాల జిల్లా: అయిజ పట్టణంలో తహశీల్ధార్ ఆఫీస్ కు కూత వేటు దూరంలో.. PVT LTD పేరుమీద గుజరాత్ రాష్ట్రానికి చెందిన 25 సంవత్సరాల యువకుడు రియల్ ఎస్టేట్ కంపెనీ అని హంగు ఆర్భాటలతో అయిజలోని కొంతమంది బడా బాబుల వ్యక్తుల సహకారంతో.. అడ్రస్ ద్వారా ఆఫీస్ ను పెట్టి అతి తక్కువ రోజులలో ప్రజల నుంచి కోట్ల రూపాయలు దండుకున్నారు.. కేవలం 3 నెలల వ్యవధిలో 25 నుంచి 50 కోట్లకు పైగా వసూలు చేసారని గుసగుసలు..ఒక లక్ష రూపాయలు జమ చేస్తే ప్రతి నెల 40వేల రూపాయలు 5 నెలల పాటు ఇస్తారు..(40 రూపాయల వడ్డీ చొప్పున) ..10 లక్షలు రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే నెలకు 4లక్షలు ఇవ్వడం ఐదు నెలలపాటు.. షూరిటీ లేకుండా అలా ఇస్తారు.. 10లక్షలు పెట్టుబడి పెట్టె కస్టమర్ షూరిటీ కావాలంటే కస్టమర్కు పోస్ట్ డేటెడ్ చెక్స్ ఇస్తూఅయిజ పట్టణానికి సుదూర ప్రాంతంలో ఉన్న ప్లాట్ ను తక్కువ ధరలో ఉన్న రిజిస్ట్రేషన్ చేస్తారు.. అందుకు కంపెనీ ప్రతి నెల4లక్షలు జమ అయ్యే చెక్కు లను పెట్టిబడి పెట్టిన వారికి తీరిగి ఇస్తారు.. పెట్టుబడి పెట్టె వారిని తీసుకు వస్తే వారికి కూడా కమిషన్ ఇస్తామంటారు కంపెనీ ప్రతినిధులు..ప్రస్తుతం ఈజీ మనీకి అలవాటు పడినవారు పెట్టుబడును పెడుతున్నారు… వారి నుండి కస్టమర్లను చేర్పించే ప్రయత్నం చేస్తున్నారూ… చేర్పించే వారికి పెద్ద మొత్తంలో కమిషన్ ఇస్తారు..ట్రేడింగ్ కంపెనీ బోర్డు తెల్లటి రంగుతో తుడిచివేత..AGGK ట్రేడర్సు వ్యవహారం బట్టబయలు అయ్యింది. దీనితో ఆ సంస్థ కాస్త బోర్డు తిప్పేసే పనిలో నిమగ్న మయ్యింది. మొన్నటి దాకా ఏర్పాటు చేసుకున్న కార్యాలయానికి ఉన్న నేమ్ ప్లేట్ బోర్డును కనబడకుండా చేశారు. అయిజలో ప్రక్క ప్రక్కనే రెండు కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. వాటికి బలంగా కనబడే విధంగా ఏజీజీకే ట్రేడర్సు అని మొన్నదాకా శుక్రవారం రోజు వరకు రాసుకు తిరిగారు యజమాన్యం. ఆదివారం రోజు ఉదయానికే అవి కాస్త కనబడకుండా చేశారు. ప్రధాన కార్యాలయానికి ఉన్న ఫ్లెక్సి బోర్డును చించివేశారు. ప్రక్కనే ఉన్న మరో కార్యాలయానికి ఉన్న నేమ్ బోర్డును తెల్ల రంగుతో తుడచి వేశారు. బోర్డును తిప్పేశారంటే సంస్థను తిప్పేసే పనిలో నిమగ్నమయినట్లు తెలుస్తోంది..??

Related posts

తెలంగాణ ఓటర్ల జాబితాను ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి..!!

TV4-24X7 News

రేపే మిస్ ఇండియా ఫైనల్ కాంపిటీషన్

TV4-24X7 News

నవంబర్ 20 వరకు ఇందిరమ్మ లబ్ధిదారుల లిస్ట్..!!

TV4-24X7 News

Leave a Comment