కడప:దువ్వూరు మండలం దాసరిపల్లె అటవీ ప్రాంతంలో అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి, 9 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు మైదుకూరు అర్బన్ సీఐ మస్తాన్ తెలిపారు. ఆదివారం దువ్వూరు పోలీస్ స్టేషన్ సీఐ మాట్లాడుతూ.. దువ్వూరుకు చెందిన పోలయ్య, తమిళనాడుకు చెందిన వేలన్ మణి, రాజన్ ఎర్రచందనం తరలిస్తుండగా పట్టుకొని వారి వద్ద నుంచి 5 గొడ్డళ్లు, 3 సెల్ ఫోన్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నామన్నారు.

previous post