Tv424x7
Andhrapradesh

ఫేక్ ఐడీలతో ఇండియాలోకి ఎంటరైన బంగ్లాదేశ్ జంట

నకిలీ గుర్తింపు కార్డులతో భారత్‌లోకి ప్రవేశించింది ఓ బంగ్లా జంట. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకుంది. కూచ్‌బెహార్‌ జిల్లా చంగ్రబంధ చెక్‌పోస్టు వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నారు బీఎస్‌ఎఫ్‌ జవాన్లు. నకిలీ పాన్‌, ఆధార్‌లను స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు జవాన్లు. ఇనాముల్ హక్ సోహైల్, అతని భార్య సంజిదా జినా ఎలాహితోపాటు ఓ చిన్నారి కూడా ఉంది.బంగ్లాదేశ్ నుండి 7 రోజుల మెడికల్ వీసాతో భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన జంటను బీఎస్‌ఎఫ్‌ అదుపులోకి తీసుకుంది. విచారణలో భాగంగా నకిలీ ఐడీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని పలు చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు.

Related posts

కూటమి ఎమ్మెల్యేల పై డేగ కన్ను పెట్టిన సీఎం

TV4-24X7 News

వేదాంత-వి.జి.సి.బి పోర్టు వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

TV4-24X7 News

ఏపీ సీఎస్, డీజీపీలకు ఎలక్షన్ కమిషన్ సమన్లు

TV4-24X7 News

Leave a Comment