Tv424x7
Andhrapradesh

జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌

.వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులో అక్రమాస్తుల కేసు విచారణ నుంచి జస్టిస్ సంజీవ్ కుమార్ తప్పుకున్నారు. భారతీ సిమెంట్స్‌, జగతి పబ్లికేషన్స్‌, ఎంపీ విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్(ED) దాఖలు చేసిన కేసుల విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు సీబీఐ, ఈడీ కేసులను విడివిడిగా లేదా సమాంతరంగా విచారించినప్పటికీ సీబీఐ కేసుల్లో తీర్పు తర్వాతే ఈడీ కేసుల్లో తీర్పు ఇవ్వాలని 2022 నవంబర్‌లో తెలంగాణ హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ గత ఏడాది మే నెలలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.దీనిపై ఇవాళ(బుధవారం) జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు వినిపించేందుకు ఇరుపక్షాల న్యాయవాదులు సిద్ధం అయిన నేపథ్యంలో విచారణ నుంచి తాను తప్పుకుంటున్నట్లు సీనియర్‌ న్యాయమూర్తి, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాకు జస్టిస్‌ సంజీవ్‌ కుమార్‌ చెప్పారు. దీంతో జస్టిస్ సంజీవ్‌ కుమార్‌ లేని ధర్మాసనం ముందు పిటిషన్‌ను లిస్ట్‌ చేయాలంటూ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈడీని ఆదేశించారు. సెప్టెంబర్‌ మెుదటివారంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు మరో ధర్మాసనం ఎదుట లిస్ట్‌ చేయాలంటూ కోర్టు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.

Related posts

చైన్ స్నాచింగ్ ల ముద్దాయిల అరెస్ట్

TV4-24X7 News

లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి

TV4-24X7 News

ప్రాణాలు తీసిన ప్రేమ.. మహిళా కానిస్టేబుల్ మృతి

TV4-24X7 News

Leave a Comment