పెద్దపల్లి జిల్లా:ఆగస్టు 15పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో గురువారం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ సీనియర్ నాయకులు తుంగల శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దేశభక్తితో ముందుకు సాగాలని, ఎందరో మహానుభావుల పోరాట ఫలితం కారణంగా భారతదేశానికి స్వాతంత్రం సాధించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో.. మంథని మైత్రి ఆటో యూనియన్ సీనియర్ నాయకులు ముత్యం శ్రీనివాస్,ఎండీ, సర్వర్,పెంటరి మొగిలి, మంథని శంకర్, బొలిశెట్టి సతీష్, పెంటరి రాజు, పుట్ట రమేష్, ఏ గోలపు సమ్మయ్య, తుంగల రాజు, ఈశ్వర్, ఆటో డ్రైవర్లు ఆటో ఓనర్స్, అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

previous post