Tv424x7
Telangana

మీ సేవ ఓనర్ దందా.. రూ. 50 వేలకు ఇంటి పట్టా : పదిమందిపై కేసు

నిజామాబాద్ జిల్లాలోని బొందెం చెరువు శిఖంలో ఇండ్ల కూల్చివేత ఘటన తర్వాత అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సర్వే నంబర్​2099లోని 23.02 ఎకరాల చెరువును ఆనుకొని1.33 ఎకరాల ప్రైవేట్​ల్యాండ్​ పేరుతో శిఖంలోకి ఎంటరై ఫేక్ పట్టాలతో స్థలాల అమ్మినట్టుగా రెవెన్యూ శాఖతో కలిసి పోలీసులు లెక్క తేల్చారు. ఇందులో 100, 120, 150, 180 గజాల ప్లాట్లు చేసిమ దాదాపుగా వంద మందికి అమ్మినట్లుగా పోలీసులు గుర్తించారు. ఒక్కోదానికి రూ.50 వేలు తీసుకొని అమ్ముతున్నట్లు తేల్చి అరెస్ట్ చేశారు. ఇప్పటిదాకా సుమారు 500 పట్టాలు తయారు చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మీ సేవ ఓనర్ తో పాటుగా మరో పదిమందిని పోలీసులు అరెస్ట చేశారు. అతని నుంచి ఆఫీసర్ల పేరుతో తయారుచేసే రబ్బర్ స్టాంపులు, నకిలీ పట్టా పేపర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Related posts

డిసెంబర్28 నుంచే రూ.500కు గ్యాస్ సిలిండర్ రాష్ట్రంలో 1.20 కోట్ల గ్యాస్‌ కనెక్షన్లు.. మహిళల పేరుతో 70 లక్షలు

TV4-24X7 News

సెప్టెంబర్ 17న ‘సుభద్ర యోజన’ ప్రారంభం: ఒడిశా సీఎం

TV4-24X7 News

తెలంగాణలో రేపటి నుంచి బీసీ కమిషన్‌ పర్యటనలు..!!

TV4-24X7 News

Leave a Comment