నంద్యాల జిల్లా గడివేముల మండలం మంచాలకట్ట గ్రామంలో ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారామంచాలకట్ట చెరువు కు నీటిని విడుదల చేశారు. దీనివలన 700 ఎకరాల రైతుల పంటలకు మేలు చేసే విధంగాఉంటుందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ ఈసారి పుష్కలంగా వర్షాలు రిజర్వాయర్లు చెరువులు కు జలకల ఉందన్నారు చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి సీఎం గా ఉండడం అదృష్టం కరమన్నారు. ఈ సందర్భంగా మండల నాయకులు వంగాల శ్రీనివాస్ రెడ్డి మండల కన్వీనర్ దేశం సత్యనారాయణ రెడ్డి, వంగాల మురళీధర్ రెడ్డి, కూటమి నాయకులు, జనసేన నాయకులు, పాల్గొన్నారు.
