Tv424x7
Andhrapradesh

ప్రయాణికుల బ్రతుకులను ఇబ్బంది కలగచేస్తున్న ప్రధాన రహదారి

నంద్యాల జిల్లా గడివేముల మండలం నుండి కర్నూలు వైపు వెళ్లే రహదారి అద్వానంగా మారడం ఇది అలవాటుగా మారింది.ఇది పొలాలకు వెళ్లే రోడ్డు అనుకుంటే పొరపాటే ఇది గడివేముల నుండి కర్నూలు వెళ్లే మార్గం . ఈ రహదారి భయంకర స్థితిలో ఉంది.ఈ రహదారిని పట్టించుకొనే అధికారులే లేరు ఈ మార్గంలో వందల ద్విచక్ర వాహనాలు, బస్సులు, ఇతర వాహనాలు ఎంతోమంది ప్రయాణికులు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఈ మార్గంలో వెళ్లడం జరుగుతుంది. ఈ దీనస్థితిలో ఉన్న మార్గం ను ప్రభుత్వం కనికరిస్తే ఈ రోడ్డున తిరిగే ప్రయాణికులు ఊపిరి పీల్చుకుంటారు.గత ప్రభుత్వం ఈ మార్గానికి ప్యాచిలేసిన అది కొంతకాలానికి పరిమితమైంది. ఈ రోడ్డు వైపు అధికారులు గానీ ప్రభుత్వం గానీ నాణ్యతను పరిశీలించలేదు. పరిశీలించనందుకు నాణ్యత లేని రోడ్డును వేయడం జరిగింది. ధీని వలన ఎంతోమంది ప్రయాణికులు ఇబ్బందిపడుతూ ఉన్నారు. వర్షాకాలం వస్తే వర్షం రావడం వలన గుంతలులో వర్షపు నీరు రోడ్డుకు,గుంతలుకు తేడా లేకుండా రోడ్డు ఎక్కడుందో కూడా అర్థం కావడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు.దీనివలన ఆటోలు ద్విచక్ర వాహనాలు కింద పడి కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. ప్రభుత్వము ఆర్ అండ్ బి అధికారులను అప్రమత్తం చేసి గడివేముల నుండి కర్నూలుకు వెళ్లే రహదారి నీ పరిశీలించి మంచి రోడ్డు ను వేయించాలని ఈ మార్గంన తిరిగే ప్రయాణికుల ఆవేదన.✍️

Related posts

నేడు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

TV4-24X7 News

నేడు, రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

TV4-24X7 News

కొడాలి నాని ఇంటిపై కోడిగుడ్లు విసిరిన టీడీపీ శ్రేణులు

TV4-24X7 News

Leave a Comment