విశాఖ ఈస్ట్ ఏసీపీగా కొండప ల్లి లక్ష్మణమూర్తి బాధ్యతలు చేపట్టారు. 1995 బ్యాచ్ కు చెందిన లక్ష్మణరావు విశాఖలో టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్లో ఎస్.ఐ .గా విధులు చేపట్టారు. అనంతరం సీ.ఐ.గా త్రీ టౌన్, పెందుర్తి, పీ.ఎం.పాలెం, భీమిలి, ఇంటిలిజెన్సీ లలో పని చేసి ప్రస్తుతం అనకాపల్లి స్పెషల్ బ్రాంచ్ 2 సీ.ఐ.గా విధులు నిర్వహిస్తూ డిఎస్పీగా పదోన్నతి పొంది ప్రస్తుతం విశాఖ ఈస్ట్ ఏసీపీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సిబ్బంది ఏసీపీకి శుభాకాంక్షలు తెలిపారు.

previous post