విశాఖపట్నం 31వార్డ్ డ్వాక్రా బజార్ కమ్యూనిటీ హాల్ లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి సితంరాజు సుధాకర్ పాల్గొన్నారు.దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఫీవర్ వల్ల కార్యక్రమంనికి రాకపోవడంతో టీడీపీ ఇంచార్జి సితంరాజు సుధాకర్.అధ్యక్షతలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నీ ఈ సందర్భంగా సితంరాజు సుధాకర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు కలిగిన లబ్ధిని అదేవిధంగా రాబోయే రోజులలో జరిగే అభివృద్ది పై పలు అంశాలను ప్రజలకు వివరించారు. 100 రోజులలో ప్రజల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరిచిన సిఎం, డిప్యూటీ సిఎం కి ధన్యవాదాలు తెలిపారు. సంక్షోభం లో ఉన్నప్పటికీ అభివృద్ది లో ముందుకు వెళ్తున్నామని అన్నారు. అనంతరం ప్రజల వద్దకు స్వయంగా వెళ్లి కరపత్రాలను అందజేశారు. రానున్న కాలంలో దక్షిణ నియోజకవర్గం లో చేపట్టబోయే అభివృద్ది పనులను ప్రజలకు వివరించారు. అనంతరం విజయవాడ లో వరద బాధితులకు సహాయ సహకారాలు అందించిన ప్రభుత్వ సిబ్బందిని సన్మానించారు. అన్న క్యాంటీన్లు ప్రారంభం, ఉద్యోగస్తులకు జీతాలు, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ ,పంచాయతీ అభివృద్ధి వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అతి తక్కువ కాలంలో చేపట్టిన ఘనత కూటమి ప్రభుత్వానిది అని అన్నారు. కార్యక్రమంలో టిడిపి సౌత్ ఇంచార్జ్ సుధాకర్, జోనల్ కమిషనర్ నాయుడు, జనసేన పార్టీ సౌత్ ఇంచార్జ్ శివప్రసాద్ రెడ్డి ,31వార్డ్ టీడీపీ అధ్యక్షులు సారిపల్లి మహేష్,వార్డ్ జనసేన అధ్యక్షురాలు రూప ,వార్డ్ టీడీపీ నాయకులు బత్తిన నవీన్ కుమార్ ,వార్డ్ మైనారిటీ నాయకులు ఇలియజ్ , కూటమి వార్డు అధ్యక్షులు, టిడిపి జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
