ఆపదంటే సాయం మందించే దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే , వైసిపి సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ సీనియర్ కెమెరా జర్నలిస్టు రోనంకి ఉదయ్ కుమార్ కు రూ. 5000 లను అందజేసి భరోసా కల్పించారు. ఆశీలమెట్ట పార్టీ కార్యాలయంలో బుధవారం ఉదయం నగదును అందజేశారు. గత కొద్ది రోజులుగా ఎడమ కాలు బోను సమస్యతో ఇబ్బంది పడుతున్న జర్నలిస్ట్ ఉదయ్ మెడికల్ ఖర్చులకు సాయం అందించి అండగా నిలిచారు. నియోజకవర్గ ప్రజలతో పాటు కష్టంలో ఉన్న పాత్రికేయులకు కూడా ఆర్థిక సాయం అందిస్తూ వాసుపల్లి గణేష్ కుమార్ తన ఉదాసీనత చాటుకుంటున్నారు. సాయం అందించడం పట్ల పాత్రికేయులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే కెమెరా జర్నలిస్టు ఉదయ్ ఆదుకున్న మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.

previous post